హైద‌రాబాద్‌లో మ‌రో రోడ్డు ప్ర‌మాదం.. ఈ సారి ట్యాంక్‌బండ్‌పై..!

By Medi Samrat  Published on  24 Nov 2019 8:47 AM GMT
హైద‌రాబాద్‌లో మ‌రో రోడ్డు ప్ర‌మాదం.. ఈ సారి ట్యాంక్‌బండ్‌పై..!

న‌గ‌రంలో నిన్న మ‌ధ్యాహ్నం జ‌రిగిన‌ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్ర‌మాదం మ‌రువ‌క ముందే.. నేడు న‌గ‌ర న‌డిబొడ్డుపై మ‌రో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వివ‌రాళ్లోకెళితే.. ట్యాంక్‌బండ్ పై యూ టర్న్ తీసుకుంటున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర‌ గాయాలు అయ్యాయి. ఈ సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

యాదాద్రికి చెందిన సాయితేజ.. తన స్నేహితుడు భానుప్రకాశ్ తండ్రి.. ఇద్ద‌రూ పల్సర్ ద్విచక్రవాహనంపై శనివారం తెల్లవారుజామున ట్యాంక్‌బండ్ వ‌ద్ద‌ యూటర్న్ తీసుకుంటున్నారు. కాగా.. అదే సమయంలో రాణిగంజ్ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న శివకుమార్, ఆర్యన్ లు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

గాయ‌ప‌డిన న‌లుగురిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్య చికిత్స కోసం భానుప్రకాష్, సాయితేజను ఉప్పల్ లోని ఆదిత్య ఆసుపత్రి కి తరలించినట్లు గాంధీనగర్ పోలీసులు తెలిపారు. వీరిలో భానుప్రకాష్ కు కాలు విరిగినట్లు పోలీసులు తెలిపారు. సాయితేజ తండ్రి వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story