శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం..

By అంజి  Published on  15 March 2020 2:49 AM GMT
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం..

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్‌ ఢీకొన్ని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గార మండలం బైరి జంక్షన్‌ వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

గాయాలపాలైన వారిని శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాద బాధితులు సరుబుజ్జిలి మండలం కొత్తపేట వాసులుని పోలీసులు తెలిపారు. నరసన్నపేటలోని తమ బంధువుల వివాహా వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు వెంకటి, సింహాచలంతో పాటు శ్రీలత అనే మహిళ మృతి చెందింది. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమా లేక మద్యం మత్తులో ఆటో నడిపారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన వారు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story
Share it