ముంబయి: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఓ సరుకు రవాణా వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. మహారాష్ట్ర దులేలోని వించూర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదంలో ఎడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. దాదాపు 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులుల సహాయక చర్యలు చేపట్టారు. నదిలో నుంచి మృతదేహాలను వెలికి తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.