బ్రేకింగ్: అనంతపురం జిల్లోలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

By సుభాష్  Published on  10 Sept 2020 2:56 PM IST
బ్రేకింగ్: అనంతపురం జిల్లోలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా పోలీసు శాఖ ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతుంది. తాజాగా అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం వడియం పేట వద్ద కంటైనర్‌-ఆటో ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందగా, మరో ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు ఏపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు వడియం పేట గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ప్రతి రోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం వల్ల రహదారులు రక్తసిక్తంగా మారుతున్నాయి. అజాగ్రత్త, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

Next Story