నగరంలో మరో మహిళ ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం

By Newsmeter.Network
Published on : 27 Nov 2019 6:21 PM IST

నగరంలో మరో మహిళ ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌లో వరుసుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం మరవకముందే.. ఏఎస్‌రావు నగర్‌ చౌరస్తాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

అతివేగంగా వెళ్తున్న ట్రక్కు.. స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ తలపై నుంచి ట్రక్కు టైరు వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కాగా.. హెల్మెట్‌తో సహా ఆ మహిళ తల ఛిద్రమైంది. ఏఎస్‌రావు నగర్‌ చౌరస్తాలోని రాధిక థియేటర్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అయితే ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఘటనా స్ఠలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇంకా మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story