కరోనా ఎఫెక్ట్ : మంచి చెప్పిన నటుడిపై దాడి

By సుభాష్  Published on  10 April 2020 4:05 AM GMT
కరోనా ఎఫెక్ట్ : మంచి చెప్పిన నటుడిపై దాడి

దక్షణాది బాషల్లో పలు చిత్రాలలో నటించిన ప్రముఖ నటుడు రియాజ్ ఖాన్పై పలువురు వ్యక్తులు దాడి చేశారు. రియాజ్ది తమిళనాడులోని చైన్నై కాగా.. ఇతడు మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. వివరాళ్లోకెళితే.. రియాజ్ బుధవారం పన్నయార్ ప్రాంతంలోని తన నివాసంలో వ్యాయామం చేసుకుంటుండగా.. తన నివాసం దగ్గరలో కొంతమంది వ్యక్తులు గుమిగూడి ముచ్చట్లు పెడుతున్నారు. ఇది గమనించిన రియాజ్.. వారి వద్దకు వెళ్లాడు.

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేఫథ్యంలో ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాలించాలని.. గుమిగూడి వుండటం మంచిది కాదని.. ఇక్కడినుండి వెళ్లిపోండని వారికి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఇవేమి పట్టించుకోని వారు రియాజ్పైకి ఎదురు తిరిగారు. రియాజ్ కూడా వారికి కొంచెం గట్టిగా చెప్పే ప్రయత్నం చేయగా.. వారిలో ఒకరు అతనిపై దాడికి పాల్పడ్డాడు. నిబంధనలు పాటించడన్న పాపానికి కనీసం జ్ఞానం లేకుండా పశువుల్లా ప్రవర్తించారు.

ఈ విషయమై రియాజ్ కనత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాధ్యతతో వ్యవహరిండి.. అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెత్తి, నోరు బాదుకుని చెప్తున్నా కొందరిలో మాత్రం ఏమాత్రం చలనం లేకుండా ఇలా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో నెటిజన్లు సోషల్మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it