Fact Check : రిషి కపూర్ చనిపోయేముందు పాట పాడించుకున్నారా ? అదే చివరి వీడియోనా ?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 April 2020 5:10 PM GMT
Fact Check : రిషి కపూర్ చనిపోయేముందు పాట పాడించుకున్నారా ? అదే చివరి వీడియోనా ?

బాలీవుడ్ వెటరన్ నటుడు రిషీకపూర్ కన్నుమూయడం బాలీవుడ్‌ను విషాదంలో మంచెత్తింది. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో కేవలం 20 మంది మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే.. సినీ పరిశ్రమ మాత్రం విషాదంలో మునిగింది. ఒక్క బాలీవుడే కాదు.. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా.. రిషికపూర్ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అయితే.. ఈ విషాద సమయంలో ఓ వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాను ముంచెత్తింది. అందరినీ ఆకట్టుకునేలా ఉన్న ఆ వీడియో చూసిన వాళ్లంతా రిషికపూర్ ను ఓసారి గుర్తు చేసుకున్నారు.

రిషికపూర్ ఆస్పత్రిలో బెడ్ మీద పడుకొని ఉన్నారు. ఆయన పక్కనే బెడ్ మీద కూర్చున్న వ్యక్తి రిషికపూర్ నటించిన ఓ సినిమాలోని ''తేరే దర్ద్ సే దిల్ ఆబాద్ రహా'' పాటను ఎంతో రాగయుక్తంగా పాడి వినిపించాడు. పాట విన్నంత సేపూ మంచంపైనే పడుకుని నవ్వులు చిందించిన రిషీకపూర్ ఆ పాట పూర్తయిన వెంటనే ఆ యువకుడికి తన ఆశీస్సులు అందించారు. జీవితంలో కష్టపడి పైకి రావాలని సూచించారు. కష్టపడటమే మన వంతు అని, పేరు ప్రఖ్యాతులు అనేవి వాటంతటవే వస్తాయని అన్నారు.

[video width="640" height="368" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/WhatsApp-Video-2020-04-30-at-10.07.25-PM.mp4"][/video]

ఈ వీడియో రిషికపూర్ చనిపోయే ముందు రోజు రాత్రి రికార్డ్ చేసిందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రిషికపూర్ ఎంతో ఉత్సాహంగా పాటవిని పాట పాడిన వ్యక్తిని ఆశీర్వదించడాన్ని ఫ్యాన్స్ అంతా కొనియాడారు. చివరి క్షణాల్లో ఇలా తన పాట వినగలిగే భాగ్యం చాలా అరుదని కూడా వ్యాఖ్యానాలు పెట్టారు.

Image1

వీడియో అందరినీ ఆకట్టుకుంది సరే.. కానీ, ఈ వీడియో నిజంగా రిషికపూర్్ చనిపోయే ముందు రికార్డ్ చేసిందేనా అన్న విషయం ఫ్యాక్ట్ చెక్ చేస్తే పలు వివరాలు బయటపడ్డాయి. ఈ వీడియోను పల్లవ్ పలివాల్ అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీంతో.. అందరి దృష్టీ ఈ వీడియోపై పడింది. https://www.instagram.com/p/B_mcx3eFNnz/?utm_source=ig_web_button_share_sheet అనే ఇన్ స్టాగ్రామ్ లింక్ లో ఈ వీడియోను చూడొచ్చు.

2

అయితే.. ఈ వీడియో ఆధారంగా అది ఎప్పుడు తీసి ఉంటుందో అని నిజ నిర్ధారణ చేయగా.. యూట్యూబ్ లో ఈ వీడియో కనిపించింది. ఈయేడాది ఫిబ్రవరి 3వ తేదీన ఆ వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.

3

ఆ వీడియోను పరిశీలిస్తే.. రిషికపూర్ బెడ్ మీద కూర్చొని పాటపాడిన వ్యక్తి పేరు ధీరజ్ కుమార్ సాను గా తేలింది. ధీరజ్ కుమార్ తన యూట్యూబ్ చానల్ లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు.

వాస్తవాలు చూస్తే ఈ వీడియో తప్పుడు వీడియో కాదు.. నిజమే. కానీ, ఇది రికార్డ్ చేసింది. ఈయేడాది ఫిబ్రవరిలో అయితే.. రిషికపూర్ చనిపోయిన ముందురోజు రికార్డ్ చేసిన వీడియో అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంటే.. ఇది ఫేక్ న్యూస్ కాదు.. కానీ, మిస్ ఇన్ఫర్మేషన్. సో... గతంలో రికార్డ్ చేసిన వీడియోను ఇప్పుడు అవకాశాన్ని బట్టి వైరల్ గా మార్చేశారు.

ప్రచారం : రిషికపూర్ చనిపోయే ముందు రోజు ఆస్పత్రిలో పనిచేసే అబ్బాయితో పాట పాడించుకొని విన్నారు. అతన్ని ఆశీర్వదించారు కూడా..

వాస్తవం : ఈ వీడియో వాస్తవమే కానీ, ఈ యేడాది ఫిబ్రవరి 3వ తేదీన అంటే మూడు నెలలక్రితం యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన వీడియో.

కంక్లూజన్ : వీడియో ఆకట్టుకునేలా ఉన్నా.. గతంలో తీసిన వీడియో కాబట్టి ఇది మిస్ ఇన్ఫర్మేషన్.

- సుజాత గోపగోని

Claim Review:Fact Check : రిషి కపూర్ చనిపోయేముందు పాట పాడించుకున్నారా ? అదే చివరి వీడియోనా ?
Claim Fact Check:false
Next Story