రాహుల్ ఆడితే.. పంత్ కు క‌ష్ట‌మే..?

By Newsmeter.Network  Published on  18 Jan 2020 10:32 AM GMT
రాహుల్ ఆడితే.. పంత్ కు క‌ష్ట‌మే..?

భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ నిన్నటి మొన్నటి వరకు అందరి నోళ్లలో నానిన పేరు. అద్భుత మైన ప్రతిభ పంత్ సొంతం. భారత మాజీ కెప్టెన్ ధోని కి సరైన వారసుడు రిషబ్ పంత్ అని పలువురు అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్లే సెలక్టర్లు సైతం పంత్ కు బాగానే అవకాశాలు ఇచ్చారు. మొదట్లో అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ తన పై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు కూడా.

అయితే త‌రువాత అత‌ని ఆట గాడి త‌ప్పింది. నిల‌క‌డ లోపించింది. అన‌వ‌స‌ర షాట్ల‌తో జ‌ట్టుకు ఔటై జ‌ట్టుకు భారంగా త‌యార‌య్యాడు. కెప్టెన్ కోహ్లీ, టీమ్ మేనేజ్‌మెంట్ స‌పోర్టుతో బండి నెట్టుకొస్తున్నాడు పంత్.

ఎంకి పెళ్లి.. సుబ్బిచావుకి వచ్చినట్లు తయారైంది ప్ర‌స్తుతం ఈ వికెట్ కీప‌ర్ పరిస్థితి. గాయం కారణంగా రిషభ్‌ దూరమైతే, ఇప్పుడు అది అతని కెరీర్‌కే ప్రమాదం తెచ్చిపెట్టేలా ఉంది. రిషభ్‌ పంత్‌ స్థానంలో కీపర్‌గా రాహుల్‌ ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో రిషభ్‌ గాయపడటంతో అతని స్థానంలో రాహుల్‌ కీపింగ్‌కు దిగాడు.

ఇక రెండో వన్డేలో సైతం రాహులే కీపింగ్‌ చేశాడు. రాహుల్ వికెట్ల వెన‌క్క చురుకుగా కద‌డ‌లంతో పాటు రెండో వ‌న్డేలో అద్భుత‌మైన బ్యాటింగ్ చేశాడు. ఇక ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌గ‌డం రాహుల్ క‌లిస్తోంది.Kl Rahul Keeper 1579004590

రాహుల్‌ కీపింగ్‌లో బ్యాటింగ్‌లో సత్తాచాటడంతో సోషల్‌ మీడియాలో రకరకాలు మీమ్స్‌ పోస్ట్‌ చేసి పంత్‌ను ఆడేసుకుంటున్నారు నెటీజ‌న్లు. రెండు వన్డేల్లో వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌ దిగి రాణించిన రాహుల్‌ కీపింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. రెండో వన్డేలో ఆసీస్‌ కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ను స్టంపౌట్‌ చేయడంతో పాటు డీఆర్‌ఎస్‌లో కూడా కచ్చితమైన అభిప్రాయాన్ని చెబుతూ ఉండటంతో రాహుల్‌ కీపర్‌గా ఫిట్‌.. పంత్‌ ఔట్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

టెస్టుల్లో కూడా మ‌నోడి ప‌రిస్థితి ఏమంత బాగోలేదు. టెస్టు వికెట్ కీప‌ర్ గా వృద్ధీమాన్ సాహా రాణిస్తుండ‌డంతో ఇప్ప‌టికే టెస్టు జ‌ట్టులో చోటు కోల్పోయాడి లెప్ట్ హ్యాండ‌ర్‌. సాహా గాయ‌ప‌డితే త‌ప్ప జ‌ట్టులో చోటు ద‌క్క‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు పంత్ కు సంజు శాంస‌న్‌, భ‌ర‌త్ వంటి యువ క్రికెట‌ర్లు పోటీలో ఉండ‌గా ఇప్పుడు వారితో పాటు రాహుల్ కూడా చేరాడు.

టీమిండియా త‌రుపున 11 టెస్టుల్లో ప్రాతినిధ్యం వ‌హించిన పంత్ 754 ప‌రుగులు చేశాడు. ఇందులో 2 సెంచ‌రీలు, 2అర్థ శ‌త‌కాలు ఉన్నాయి. ఇక వ‌న్డేల్లో 16 మ్యాచుల్లో ఒకే ఒక్క అర్థ‌శ‌తకంతో 374 ప‌రుగులు చేశాడు. 28 టీ20ల్లో 2 అర్థ‌శత‌కాల‌తో 410 ప‌రుగులు చేశాడి.

ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్‌మేనేజ్ మెంట్ స‌పోర్టుతో బండి లాగిస్తున్న పంత్ వీలైనంత తొంద‌ర‌గా త‌న త‌ప్పుల‌ను తెలుసుకుని రాణించ‌క‌పోతే త‌న కెరీరే ప్ర‌శ్నార్థ‌కంగా మార‌నుంది. పంత్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అతన్ని కొంత కాలం పాటు పక్కన పెట్టి రాహుల్‌నే కీపర్‌గా కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదే జ‌రిగితే పంత్ కెరీయ‌ర్ ముగిసిన‌ట్లేన‌ని ప‌లువురు మాజీలు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Next Story