ప్రియురాళ్ల‌తో విహార‌యాత్ర‌ల్లో టీమిండియా ఆట‌గాళ్లు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Jan 2020 9:38 AM GMT
ప్రియురాళ్ల‌తో విహార‌యాత్ర‌ల్లో టీమిండియా ఆట‌గాళ్లు..!

నిన్న టీమిండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా త‌న ప్రియ‌రాలుతో విహార‌యాత్ర, ఎంగేజ్‌మెంట్ ఫోటోలు షేర్ చేసి సోష‌ల్ మీడియాలో హ‌డావుడి చేయ‌గా.. నేడు టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్ వంతు వ‌చ్చింది. టీవీ నటి ఇషా నేగీతో ఉన్న ఫొటోను పంత్ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. అంతేకాదు దానికి అందమైన క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు.

నిన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నా.. ఎందుకంటే నా సంతోషానికి నువ్వే కారణం అంటూ క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేశాడు. క్రిస్ట్‌మస్‌, న్యూఇయర్‌ వేడుకల్లో భాగంగా ఈ జంట విహార యాత్రల్లో మునిగి తేలుతోంది. దీంతో రిషభ్‌-ఇషాల జోడి ప్రేమాయణం మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యింది.

ఇక ఇషా నేగీ కూడా అదే ఫోటోను షేర్ చేస్తూ 'ఫిఫ్త్‌ ఇయర్‌ అండ్‌ కౌంటింట్‌.. లవ్‌ యూ స్కై బిగ్‌ బబ్బీ’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. అంటే వీరిద్ద‌రి స్నేహం-ప్రేమ మొదలై ఐదేళ్లు అయినట్లు చెప్ప‌క‌నే చెప్పింది నేగీ. ఇక‌ కొంత కాలంగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఫోటోల‌ను షేర్ చేస్తూ క్యాప్షన్‌లను కూడా వైవిధ్యంగా పోస్ట్‌ చేయడంతో వీరిద్ద‌రు ప్రేమలో ఉన్నార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్లు కోడై కూస్తున్నారు.మరి ఇది పెళ్లి పీటల వరకూ వెళుతుందో లేదో చూడాలి

Next Story