సచిన్ ట్వీట్.. లారెన్స్ రీ ట్వీట్..!
By Newsmeter.Network Published on 2 Jan 2020 4:33 AM GMT
ఒక మనిషి జీవితానికి ఆశావాహ దృక్వథం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భవిష్యత్తుపై కాసింత ఆశ ఉంటే చాలు ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా సులువుగా తట్టుకోవచ్చు. ఇదే విషయాన్ని సచిన్ టెండుల్కర్ ఓ చిన్న వీడియో ద్వారా తెలియజెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూలర్క్ ఓ అద్భుతమైన వీడియోను ట్వీట్ చేశారు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న దివ్యాంగ ప్లేయర్ మద్దా రామ్ వీడియోను సచిన్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాళ్లు లేకపోయిన ఆ చిన్నారి నేలపై పాకుతూనే పరుగులు రాబడతాడు. మానసిక స్థైర్యానికి సచిన్ ముగ్ధుడయ్యారు. ఈ వీడియో తననెంతో భావోద్వేగానికి గురిచేసినట్లు చెప్పిన సచిన్, ఆ కుర్రాడి ఆత్మవిశ్వాసం మీలోనూ విశ్వాసాన్ని నింపుతుందని ఆశిస్తున్నానన్నారు.
ఇలాంటి ఇన్స్‌పిరేషన్ వీడియోలతో మీ నూతన సంవత్సరాన్ని ఆరంభించాలంటూ సచిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. నెటిజన్లను కదిలించిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై సినీ ప్రముఖుడు రాఘవ లారెన్స్ స్పందించారు. ‘ఈ వీడియో నాకు చాలా నచ్చింది. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. దీన్ని షేర్ చేసినందుకు థ్యాంక్యూ సర్’ అంటూ లారెన్స్ రీ ట్వీట్ చేశారు.