ఢిల్లీ:  సీనియర్‌ రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి పీఎస్‌ కృష్ణన్‌ మృతి చెందారు. అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం అయిదు గంటలకు తుదిశ్వాస విడిచారు.

అయితే గతంలో ఏపీభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా కూడా ఆయన పని చేశారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం కృష్ణన్‌ కృషి చేశారు. కాగా..అఖిల భారత సర్వీసుల్లో ఉత్తమ అధికారిగా ఆయన మన్ననలు పొందారు. కృష్ణన్‌ మృతి పట్ల ఏపీ భవన్‌ అధికారులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.