పుట్టిన రోజున ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన.. కేక్‌ తిని 10 ఏళ్ల బాలిక మృతి

పదేళ్ల బాలిక తన పుట్టినరోజు కేక్ తిన్న తర్వాత అనుమానాస్పద ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

By అంజి  Published on  31 March 2024 1:49 AM GMT
Punjab girl, birthday cake, cake order, Crime news

పుట్టిన రోజున ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన.. కేక్‌ తిని 10 ఏళ్ల బాలిక మృతి 

పంజాబ్‌లోని పాటియాలాలో పదేళ్ల బాలిక తన పుట్టినరోజు కేక్ తిన్న తర్వాత అనుమానాస్పద ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక మాన్వి, ఆమె సోదరి తన పుట్టినరోజును జరుపుకునేందుకు, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన కేక్‌ను తిన్న తర్వాత రాత్రి అస్వస్థతకు గురయ్యారు. పుట్టినరోజు వేడుకల వీడియోలో బాలికకు ఆమె కుటుంబ సభ్యులు కేక్ తినిపిస్తున్నట్లు చూపించారు. అనంతరం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చిన్నారులకు వాంతులు చేసుకోవడంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు మాన్వి తాత తెలిపారు.

ఆసుపత్రిలో మాన్వి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె చెల్లెలు వాంతులు చేసుకోవడం వల్లే బతికి ఉండవచ్చునని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మాన్వి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేక్ తయారు చేసిన వారిపై ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు కోరుతున్నారు. ఇంతలో డెలివరీ చేసే వ్యక్తి ఎక్కడి నుంచి కేక్ తీసుకున్నారో అక్కడి నుంచి డెలివరీ కాలేదని కొట్టిపారేశారు. కేక్ మూలంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Next Story