సాగర తీరంలో గణతంత్ర వేడుకలు.. 15 వందల మంది పోలీసులతో..
By Newsmeter.NetworkPublished on : 17 Jan 2020 12:43 PM IST

విశాఖ : ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలను విశాఖ వేదికగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలోని రామకృష్ణ బీచ్ లో వేడుకలు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధానన్యాయమూర్తి, న్యాయమూర్తులు, సహా మంత్రులు, అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో విశాఖ కలెక్టర్ విజయ్ చంద్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బంది సూచనలు జారీ చేస్తున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో కమిటీలను నియమించారు. వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 15 వందల మంది పోలీసులతో రక్షణ ఏర్పాట్లు చేశారు.
Next Story