రిలయన్స్ జియో 25 జీబీ డేటా ఉచితంగా ఇస్తుందా ? వైరల్ మెస్సేజ్ వాస్తవమేనా ?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 April 2020 9:00 AM IST
రిలయన్స్ జియో 25 జీబీ డేటా ఉచితంగా ఇస్తుందా ? వైరల్ మెస్సేజ్ వాస్తవమేనా ?

కరోనా సమయంలో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లా, రాష్ట్రం, దేశమే కాదు.. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. చేసేందుకు పనిలేదు. ఇంటిపట్టునే టైమ్ పాస్ అయ్యే పరిస్థితి లేదు. ఈ సమయంలో జనం తమ స్మార్ట్ ఫోన్లను ఇబ్బడిముబ్బడిగా వాడేస్తున్నారు. ఫలితంగా ఇంటర్నెట్ డేటా మంచినీళ్ల లాగా ఖర్చవుతోంది. ఈ సమయంలో మొబైల్ నెట్వర్క్ కంపెనీలు అదనంగా డేటా అందిస్తే ఎంత బాగాఉంటుందో కదా...? సరిగ్గా ఈ ఆలోచనల్లో ఉన్న సమయంలోనే ఓ మెస్సేజ్ ఇన్ బాక్సుల్లో, వాట్సప్ లలో చక్కర్లు కొడుతోంది. ఆ మెస్సేజ్ ఏంటో చూద్దాం..

1

ఇదే ఆ మెస్సేజ్.. ఇక్కడ ఇచ్చిన లింక్ క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేస్తే 25 జీబీ డేటా ఉచితంగా మన అకౌంట్ లో యాడ్ అవుతుందన్నది దీని సారాంశం. ఇటీవలే రిలయన్స్ జియోలో ఫేస్బుక్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.. ఈ రెండు ఒక్కటైన సందర్భంగా ఈ ఆఫర్ అందజేస్తున్నట్టు ఫోన్ లకు మెస్సేజ్ లు వస్తున్నాయి. చాలామంది వెనకాముందూ ఆలోచించకుండా ఈ లింక్ ఓపెన్ చేస్తున్నారు. రెండు సంస్థలు కలిసినందున ఈ ఆఫర్ నిజమే అని భావిస్తున్నారు.

అయితే.. ఇదో స్పామ్ మెస్సేజ్. ఈ లింక్ గనక ఓపెన్ చేశారో మీ సెల్ ఫోన్ లో ఉన్న డేటాకు ముప్పు కొనితెచ్చుకున్నట్టే. ఈ లింక్ క్లిక్ చేస్తే మరికొన్ని లింక్ లు ఓపెన్ అవుతాయి. ఇంకొందరు ఫ్రెండ్స్ కు ఈ మెస్సేజ్ ఫార్వార్డ్ చేయాలన్న సందేశం వస్తుంది. అలా ఫార్వార్డ్ చేశాక ఓ apk ఫైల్ డౌన్ లోడ్ ఆప్షన్ వస్తుంది. అయితే.. ఆ ఫైల్ గనక ఒక్కసారి మన ఫోన్లోకి ఎంటరైతే.. మన సెల్ ఫోన్ సమాచారమంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అంతేకాదు.. మన ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకున్న బ్యాంకింగ్, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ UPI యాప్ ల వ్యక్తిగత సమాచారమంతా వాళ్లు యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఇక మీ బ్యాంకు అకౌంట్లు ఖాళీ అవుతాయి.

ఇక్కడ అందరం ఆలోచించాల్సిన అంశం ఒక్కటుంది. రిలయన్స్ జియో నిజంగానే ఈ ఆఫర్ కస్టమర్లకు ఇవ్వాలంటే.. మనకే నేరుగా ఎస్ఎంఎస్ పంపిస్తుంది. అంతేకాదు.. మైజియో యాప్ లో కూడా ఆ విషయం పేర్కొంటుంది. ఇలాంటి థర్డ్ పార్టీ లింక్ లు ఇవ్వాల్సిన అవసరం అస్సలే లేదు. కాబట్టి రిలయన్స్ జియో అదనపు డేటా అందిస్తుందన్న ఈ లింక్ ప్రమాదకరమైనది.

ప్రచారం : రిలయన్స్ జియో తన కస్టమర్లకు 25 జీబీ అదనపు డేటా అందిస్తోంది.

వాస్తవం : ఇది తప్పు. జియో ఇలాంటి ఏ ఆఫర్ నూ కస్టమర్లకు ఇవ్వడం లేదు.

కంక్లూజన్ : ఈ లింక్ గనక ఓపెన్ చేస్తే మన సెల్ ఫోన్ ప్రమాదంలో పడిపోతుంది. అన్ని యాప్ లపై యాక్సెస్ ను హాకర్లు చేజిక్కించుకుంటారు. అదేగనక జరిగితే మన బ్యాంకు అకౌంట్లు ఖాళీ అవుతాయి.

- సుజాత గోపగోని

Next Story