డిజిటల్‌ సేవలతో కిరాణ దుకాణాలు సైతం అంబానీ గుప్పెంట్లోనే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 6:50 AM GMT
డిజిటల్‌ సేవలతో కిరాణ దుకాణాలు సైతం అంబానీ గుప్పెంట్లోనే..!

ఢిల్లీ: ప్రస్తుత మార్కెట్లో డిజిటల్‌ సేవలు యూజర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. దీంతో వేల కొలది డిజిటల్‌ సేవలు మార్కెట్లో వెలిశాయి. కానీ ఆ కొత్త కంపెనీ దేశంలో డిజిటల్ సేవలను సమూలంగా మార్చేస్తుంది. ఆ సేవలు ఇప్పుడున్న సేవలకు పూర్తిగా భిన్నంగా ఉండనున్నాయి.

ప్రతి భారతీయుడికి నిజమైన డిజిటల్ సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు.. రిలయన్స్‌ ఇండస్ట్రీ అధినేత ముకేశ్‌ అంబానీ డిజిటల్‌ సేవల్లోనూ సంచలనాలకు సిద్ధమవుతోంది. ఇందకుగానూ.. పూర్తి అనుబంధ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగా రిలయన్స్‌, జియోలో తనతో పాటు ఇతర మధుపరులకు రూ.1.08 లక్షల కోట్ల రుణ పత్రాల పెట్టుబడులను ఈ అనుబంధ సంస్థకు బదిలీ చేస్తోంది. తద్వారా.. రూ.65,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడులూ ఈ అనుబంధ సంస్థకు బదిలీ అవుతాయి. దీనిలో భాగంగా రెండు కంపెనీల అనుబంధ సంస్థలు ఇప్పటికే ఆమోదం తెలిపాయి.

పెట్టుబడుల కోసమే:

జియో నెట్‌వర్క్‌ కోసం రిలయన్స్‌ ఇండస్ల్రీస్‌ లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టింది. దీంతో కంపెనీ ఖాతాల్లో అప్పుల భారం పెరిగింది.ఈ భారాన్ని తగ్గించే పనిలో ఉంది. అందుకే అయితే జియో నెట్‌వర్స్‌ ద్వారా రిలయన్స్‌ అందించే డిజిటల్‌ సేవల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటికే అనేక సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ సంస్థల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకే రిలయన్స్‌ ఇప్పుడు జియో ఆస్తులను పూర్తి అనుబంధ సంస్థకి బదిలీ చేస్తోందని భావిస్తున్నారు.

సంచలనమే:

జియో ద్వారా రిలయన్స్‌ ఇప్పటికే అనేక సేవలను అందిస్తోంది. ప్రత్యేక అనుబంధ కంపెనీ ద్వారా ప్రత్యర్థి కంపెనీలకు దిమ్మతిరిగే రీతిలో డిజిటల్‌ సేవలు అందించాలని కంపెనీ అధినేత ముకేశ్‌ అంబానీ ఆలోచిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటికే జియో ప్రవేశంతో దేశ టెలికాం రంగంలో వచ్చిన మార్పులు అందరికీ తెలుసు. ఇప్పుడు డిజిటల్‌ సేవలు ద్వారా మార్కెట్లో మళ్లీ అదే అలజడి సృష్టించాలని భావిస్తున్నట్లు సమాచారం. తన డిజిటల్‌ నెట్‌వర్క్‌తో కిరాణా దుకాణాలు మొదలుకొని సమస్త సేవలు రిలయన్స్‌ గుప్పిట్లో పెట్టుకోవాలని అంబానీ భావిస్తున్నారు.

Next Story