తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది.

By Knakam Karthik  Published on  29 Jan 2025 1:49 PM IST
Telangana, Graduate, Teacher MLC Election Schedule Release, Andrapradesh, Ceo,

తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

Telangana, Graduate, Teacher MLC Election Schedule Release, Andrapradesh, Ceo,

తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 10వ తేదీ కాగా, ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.

తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ప్రస్తుతం జీవన్ రెడ్డి( కాంగ్రెస్) కొనసాగుతున్నారు. మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ ఉపాధ్యాయ స్థానం నుంచి కూర రఘోత్తం రెడ్డి, వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ స్థానం నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనసాగుతున్నారు. కాగా ఈ ముగ్గురి పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది.

అటు ఏపీలోనూ ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్‌ జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

ఇదీ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్..

నోటిఫికేషన్ విడుదల- ఫిబ్రవరి 3

నామినేషన్ల దాఖలుకు లాస్ట్ డేట్- ఫిబ్రవరి 10

నామినేషన్ల స్క్రూటినీ- ఫిబ్ర‌వ‌రి 11

నామినేషన్ల ఉపసంహరణకు చివర తేదీ- ఫిబ్ర‌వ‌రి 13

పోలింగ్: ఫిబ్రవరి 27 (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

ఓట్ల లెక్కింపు- మార్చి త్రీ

Next Story