మందుబాబులకు శుభవార్త: ఏపీలో తగ్గిన మద్యం ధరలు
By సుభాష్ Published on 4 Sept 2020 11:28 AM ISTమద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న సీఎం జగన్.. తాజాగా మద్యంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.150 ఉండే మద్యం బాటిళ్లపై ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది . ప్రభుత్వం. అలాగే రూ.190పైగా ఉన్న మధ్య బాటిళ్లపై ధరలను పెంచింది. సవరించిన ధరతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి.
180 ఎంఎల్ బాటిల్ ధర రూ.120కి మించని బ్రాండ్లకు, రూ.30 నుంచి రూ.120 వరకు తగ్గించింది. క్వార్టర్ ధర రూ.120 నుంచి రూ.150 వరకు ఉన్న బ్రాండ్లకు రూ.30 నుంచి రూ.280 వరకు తగ్గించారు. క్వార్టర్ రూ.150 నుంచి రూ.190 వరకు ఉన్నబ్రాండ్ల ధరలను యధాథదంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక బీర్లపై రూ.30 తగ్గించారు. కాగా, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ధరలను సవరించాలని ప్రభుత్వానికి ఎస్‌ఈబీ సిఫార్సు చేసింది. ఎందరో శానిటైజర్లు, మిథైల్ ఆల్కహాల్ తాగి ప్రాణాలు కోల్పోతున్నారని, ధరలను సవరించాల్సిందిగా ప్రభుత్వానికి ఎస్‌ఈబీ కోరింది. ఈ మేరకు ప్రభుత్వం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
మరో వైపు ఇతర రాష్ట్రాల నుంచి మద్యానికి తీసుకువచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జీవో నెంబర్ 411 ప్రకారం.. మద్యాన్ని తీసుకు వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఏపీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని దాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ తీర్పులో ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకునే అవకాశాన్ని కల్పించింది హైకోర్టు.
కాగా, లాక్‌డౌన్ సడలింపుల తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ప్రభుత్వం 75 శాతం వరకు మద్యం ధరలను పెంచింది. అయితే మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాకుండా ప్రత్యేక నిఘా పెంచించారు అధికారులు. ఇందు కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను సైతం ఏర్పాటు చేశారు.