తెలంగాణలో రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లు ఇవే..

By సుభాష్  Published on  6 May 2020 3:52 AM GMT
తెలంగాణలో రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లు ఇవే..

తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 29 వరకూ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. మంగళవారం రాత్రి ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్‌ తెలంగాణలో రెడ్‌ జోన్‌, గ్రీన్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్‌లను ప్రకటించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 7 గంటల నుంచి కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు.

రెడ్‌ జోన్‌ జిల్లాలు :

 1. సూర్యాపేట
 2. వరంగల్ అర్బన్
 3. మేడ్చల్, రంగారెడ్డి
 4. హైదరాబాద్

గ్రీన్‌జోన్‌ జిల్లాలు:

 1. యాదాద్రి
 2. వరంగల్‌ రూరల్
 3. వనపర్తి
 4. సిద్దిపేట
 5. భద్రాది
 6. ములుగు
 7. మహబూబాబాద్‌‌, నగర్‌ కర్నూలు
 8. పెద్దపల్లి.

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు:

 1. సంగారెడ్డి
 2. మహబూబ్‌నగర్
 3. మెదక్‌
 4. జయశంకర్‌ భూపాలపల్లి
 5. కామారెడ్డి
 6. కరీంనగర్‌
 7. జగిత్యాల్‌
 8. మంచిర్యాల
 9. నారాయణపేట
 10. సిరిసిల్ల
 11. నల్లగొండ
 12. నిజామాబాద్‌
 13. ఆదిలాబాద్‌
 14. ఖమ్మం
 15. జనగామ
 16. కోమురం భీం
 17. నిర్మల్‌
 18. జోగులాంబ

రెడ్‌ జోన్‌లో మాత్రం లాక్‌డౌన్‌ కఠినంగా అమలులో ఉంటుందని తెలిపారు. ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story