అభిమానులకు మరో బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రభాస్‌

By సుభాష్  Published on  18 Aug 2020 4:07 AM GMT
అభిమానులకు మరో బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రభాస్‌

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తన అభిమానులకు మరో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ప్రభాస్‌ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్‌లో రాధేశ్యామ్‌ అనే లవ్‌ స్టోరీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత మహానటితో సూపర్‌ పాపులర్‌ అయిన నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వినిదత్‌ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్న 'రాధేశ్యామ్‌' చిత్రం పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే నాగ్‌ అశ్విన్‌ 'మహానటి' చిత్రాన్ని అద్బుతంగా తెరకెక్కించి అందరి మన్నలు పొందాడు. ప్రభాస్‌ సినిమాను కూడా ఆయన అదే స్థాయిలో తెరకెక్కిస్తారని అభిమానులు భావిస్తున్నారు. అంతర్జాతీయ నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల కానుందట. ఇందులో భాగంగానే నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు హిందీ స్టార్స్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు వినికిడి.

అయితే బాహుబలి తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అప్పటి నుంచి ప్రభాస్ కోసం పెద్ద పెద్ద డైరెక్టర్లు క్యూ కట్టడం, బాలీవుడ్‌ డైరెక్టర్లు సైతం ప్రభాస్‌ డేట్స్‌ కోసం ఎదురు చూడటం జరిగింది. ఈ క్రమంలోనే ప్రభాస్‌ భారీ బాలీవుడ్‌ సినిమా ప్లాన్‌ చేశాడు. అదే 'ఆదిపురుష్‌' ఈ సినిమానే తాజాగా రెబల్‌ స్టార్‌ అభిమానులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇస్తూ ప్రకటించారు ప్రభాస్‌. 'చెడుపై మంచి సాధించి విసయాన్ని సెలబ్రేట్‌ చేసుకుందాం' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా ప్రకటించారు.

ప్రభాస్‌ కెరీర్‌లో 22వ సినిమాగా ఈ 'ఆదిపురుష్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో వైపు తన 20వ సినిమాను రాధాకృష్ణ డైరెక్షన్‌లో చేస్తున్న ప్రభాస్‌.. 21వ సినిమాను నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో చేయబోతున్నాడు. ఈ మూడు సినిమాలు కూడా కథ పరంగా దేనికవే ప్రత్యేకం అని తెలుస్తోంది.

ఇక ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనేను ఫైనల్‌ చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమా సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో వస్తోంది. ఇలాంటి సినిమాలో సహజంగానే విఎఫెక్స్‌ భారీగా ఉంటాయి. దీంతో అశ్వినీదత్‌ సినిమా విఎఫ్‌ఎక్స్‌ కోసం ప్రత్యేకంగా 50 కోట్లకు పై బడ్జెట్‌ కేటాయించినట్లు తెలుస్తోంది.



Next Story