రియాల్టీ షోలో రియల్ కిస్...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 6:07 PM GMT
రియాల్టీ షోలో రియల్ కిస్...!

ఢిల్లీ: రియాల్టీ షోలు ఎలా ఉంటాయి..రచ్చరచ్చగా ఉంటాయి, యాక్షన్..నవ్వులు రియాల్టీ షోల క్రియేటివిటేనే వేరు. జడ్జిలు కూడా కెమెరాలు ముందు అందుకు తగ్గట్లుగానే ఉంటారు. అయితే..రియాల్టీ షోల్లో జడ్జిలు అందరికీ షాకులిస్తుంటారు. కాని.. 'ఇండియన్ ఐడల్ 11'లో జడ్జికి షాక్‌ ఇచ్చాడు గెస్ట్. లేడీ జడ్జి్కి ముద్దు పెట్టి జీవితంలో మరిచిపోలేని షాక్ ఇచ్చాడు.

'ఇండియన్‌ ఐడల్ 11'లో నేహా కక్కర్‌ అను మాలిక్‌, విశాల్ దడ్లర్‌ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. పాట పాడటానికి వచ్చిన ఓ గాయకుడు సాంగ్ పాడిన తరువాత...తనను గుర్తు పట్టాలని నేహాను కోరాడు. దాంతో ఆమె స్టేజీ ఎక్కింది. అతడు కొన్ని బహుమతులు నేహాకు ఇచ్చాడు. అమె కృతజ్ఞతగా హగ్ చేసుకుంది..అతడు ఒక్కసారిగా ఎవరూ ఊహించని విధంగా నేహాకు స్ట్రాంగ్ కిస్ ఇచ్చాడు. అంతే..ఆమెతోపాటు జడ్జీలు అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

Next Story