దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం
By Newsmeter.Network Published on 23 Dec 2019 11:01 AM IST
హైదరాబాద్: దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం మొదలైంది. గాంధీ ఆస్పత్రి మార్చురీలో ఎయిమ్స్ గాంధీ వైద్యులు రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్ వైద్యులు రీ పోస్టుమార్టం చేస్తున్నారు. రీ పోస్టుమార్టంను వైద్యులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. సాయంత్రం పోస్టుమార్టం రిపోర్టును గాంధీ సూపరింటెండెంట్ సీల్డ్ కవర్‌లో పెట్టి హైకోర్టుకు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే మృతదేహాలను నిందితుల బంధువులకు ఇవ్వనున్నారు. మృతదేహాలను తరలించేందుకు పోలీసులు ఇప్పటికే రెండు అంబులెన్స్‌లను సిద్ధం చేశారు.
Next Story