ముఖ్యాంశాలు

  • ఆర్థికంగా దేశాన్ని గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ చర్యలు
  • ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ గతంలో ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. నిజానికి జీ 20 దేశాలతో పోలీస్తే భారత్ జీడీపీ నే కాస్త మెరుగ్గా ఉందన్న ఆయన..1930 తర్వాత దేశంలో ఇంతటి సంక్షోభం ఎన్నడూ లేదన్నారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా స్టాకె మార్కెట్లతో పాటు చమురుఉత్పత్తుల ధరల్లో కూడా భారీ ఒడుదుడుకులుంటున్నాయన్నారు. కరోనా ప్రభావం తగ్గాక మన దేశంలో వృద్ధిరేటు 1.9 శాతంగా కొనసాగుతుందని, జీ 20దేశాల్లోకెల్లా ఇదే అత్యధికమైన వృద్ధిరేటన్నారు.

Also Read : కేటీఆర్ సార్..మీకు అలాంటి ఆలోచనేమైనా ఉంటే చెప్పండి ప్లీజ్..!

కరోనా సృష్టించిన క్లిష్టపరిస్థితుల్లో అన్ని పరిశ్రమలు, ఉద్యోగ సంస్థలు మూత పడినప్పటికీ ఏటీఎంల వినియోగం బాగా పెరిగిందన్నారు. అందుకే బ్యాంకుల్లో నగు కొరత లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. లాక్ డౌన్ ను మరికొద్ది రోజులు పొడిగించిన నేపథ్యంలో బ్యాంక్ సేవలు సజావుగానే కొనసాగుతాయని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల వల్ల 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా.

అదేవిధంగా కరోనా కారణంగా అన్ని రంగాలు మూత పడటంతో ప్రపంచ వ్యాప్తంగా 9 ట్రిలియన్ డాలర్ల వరకూ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశాలున్నాయన్నారు. కరోనా కారణంగా ఒక్క విద్యుత్ వినియోగం మాత్రం గణనీయంగా పెరిగిందన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలు :

1.బ్యాంకుల్లో కావాల్సినంత నిల్వలు ఉంచడం
2.ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాలు మంజూరు
3.జీడీపీ 3.2 శాతం నిధులు అందుబాటులో ఉంచడం
4.నేషనల్ హౌసింగ్ బోర్డుకు రూ.10 వేల కోట్లు
5. నాబార్డుకు రూ.25 వేల కోట్లు
6. ఎస్ఐడీబీఐ కి రూ.15 వేల కోట్లు మంజూరు
7. మార్కెట్లపై ఆర్థిక భారం లేకుండా చర్యలు
8. రివర్స్ రేపో రేటు 4 నుంచి 3.75 శాతానికి తగ్గింపు, రెపో రేటు యథాతథం
9. అన్ని రాష్ట్రాలకు 60 శాతం డబ్ల్యూఎంఏ పెంపు
10. లాక్ డౌన్ తర్వాత 1.2 లక్షల కోట్లు విడుదల
11.మారటోరియం సమయంలో 90 రోజుల ఎన్ పీఏ నిబంధన వర్తించదు

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.