కేటీఆర్ సార్..నాదొక సిన్సియర్ రిక్వెస్ట్. ఏప్రిల్ 20వ తారీఖుకి సెలూన్ షాప్స్ లేదా బార్బర్ షాపులను ఓపెన్ చేసే ఆలోచనేమైనా ఉంటే చెప్పండి ప్లీజ్. పెరిగిన నా జుట్టును ఎప్పుడెప్పుడు కత్తిరిద్దామా అని మా ఆవిడ ఎదురుచూస్తుంది. అదే జరిగితే మీరు లాక్ డౌన్ ను ఎత్తివేసినా నేను ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది అని ఓ వ్యక్తి ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ ను టాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.

ఆ వ్యక్తికి కేటీఆర్ తన స్టైల్ లో జవాబిచ్చారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా సెలూన్ షాప్స్ లేక తన భార్య చేతే జుట్టు కత్తిరించుకున్నాడు. మీరు కూడా అలా ఎందుకు ట్రైచేయకూడదంటూ పంచ్ వేశారు. కేటీఆర్ ట్వీట్ చూసిన నెటిజన్లు..ఇలా పంచులైతే వేస్తాం గానీ..సెలూన్ షాపులైతే తెరవం అంటారు అంతే కదా. ఇక్కడ గడ్డాలు, మీసాలు పెరిగిపోయి విసిగిపోతున్నాం. దయచేసి సెలూన్ షాపులు తెరిచేందుకు పర్మిషన్లివ్వండి సార్ అంటూ రిప్లై లు ఇస్తున్నారు.

అంతలో ఇది చూసిన కల్వకుంట్ల కవిత కేటీఆర్ ను ఉద్దేశిస్తూ..అన్నయ్యా..! నువ్వు కూడా వదినకి ఆ అవకాశం ఇస్తున్నావా ? అంటూ చమత్కరించారు. ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ సంభాషణలు కాస్తంత నవ్వులు పూయించాయి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.