'డిస్కో రాజా' సెకండ్ సాంగ్ వ‌చ్చేస్తోంది..

By Newsmeter.Network  Published on  17 Dec 2019 8:11 AM GMT
డిస్కో రాజా సెకండ్ సాంగ్ వ‌చ్చేస్తోంది..

మాస్ మహారాజ్ రవితేజ మరోసారి తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కోరాజా. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

తాజాగా విడుదల చేసిన డిస్కోరాజా ఫస్ట్ సాంగ్ అద్భుతమైన స్పందనను పొందుతోంది. ట్రెండింగ్‌లో టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్న ఈ సాంగ్, ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్‌ని రాబట్టడం విశేషం. తాజాగా డిస్కోరాజా మూవీ నుండి సెకండ్ సాంగ్ ఢిల్లీ వాలా అంటూ సాగే పాట‌ను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఎప్పుడు రిలీజ్ చేయ‌నున్నారంటే... డిసెంబర్ 20న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌వితేజ ఎంతో ఇష్ట‌ప‌డి చేస్తున్న సినిమా ఇది. ఈ క‌థ ర‌వితేజ‌కు బాగా న‌చ్చ‌డంతో... డైరెక్ట‌ర్ విఐ ఆనంద్ ఎన్ని రోజులు డేట్స్ కావాలంటే అన్ని రోజులు డేట్స్ ఇచ్చి ఈ సినిమా చేస్తున్నారు. ఇటీవ‌ల స‌రైన స‌క్స‌స్ లేక కెరీర్ లో బాగా వెన‌క‌బ‌డిన మాస్ రాజా డిస్కోరాజాగా ఆక‌ట్టుకుని మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తాడేమో చూడాలి.

Next Story
Share it