అరె.. ఇలియానా అజిత్ తో.. !

By రాణి  Published on  17 Dec 2019 2:00 AM GMT
అరె.. ఇలియానా అజిత్ తో.. !

హైదరాబాద్ : కోలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఎంతమంది స్టార్స్ ఉన్నా అజిత్ కి ఉన్న స్టార్ వాల్యూ ఏ స్టార్ హీరోకి లేదు. ఏ టాప్ స్టార్ కి సాధ్యం కాని విధంగా అజిత్ వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ తన స్టామినా ఏమిటో తమిళ్ బాక్సాఫీస్ కి ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాడు. ఏమైనా అతి పెద్ద మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న అజిత్ సినిమాలు తమిళంలో వరుస రికార్డ్స్ మీద రికార్డ్స్ సాధిస్తున్నాయి. ఈ సంవత్సరం మొదట్లో విశ్వాసం చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న ఆయన రీసెంట్ గా నెర్కొండ పార్వై అనే చిత్రంలో లాయర్ గా కనిపించి మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. కాగా అజిత్ ఇటీవలే ఓ నూతన సినిమాని ప్రకటిచడంతో పాటు, పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. వాలిమై అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుండి మొదలు కానుందని తెలుస్తుంది.

కాగా నెర్కొండ పార్వై చిత్రాన్ని తెరకెక్కించిన హెచ్ వినోతే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో అజిత్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఒక పాత్రలో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. అలాగే మరో రౌడీ పాత్రలో కూడా అజితే నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో ఇలియానాని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏమైనా అజిత్ పక్కన ఛాన్స్ అంటే.. ఇలియానాకి అది బంపర్ ఆఫరే.. మరి ఇల్లీ బ్యూటీ ఈ ఆఫర్ ను ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలోని మిగతా నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

Next Story