మన దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్థిక మందగమనం ఉందన్నమాట తాను ఒప్పుకోను అన్నారు. సినిమాల వల్ల భారీస్థాయి వ్యాపారం జరుగుతోందని.. ఇటీవలే విడుదలైన మూడు బాలీవుడ్ హిట్ చిత్రాలు అందుకు నిదర్శనమన్నారు. ఈ నెల 2వ తేదీ ఒక్క‌ రోజే ఆ చిత్రాలు రూ. 120 కోట్ల మేర కలెక్షన్స్ సాధించాయి.. మరీ ఆర్థిక మందగమనం ఎక్కడుందంటూ చమత్కరించారు. దేశంలో ఆర్థిక పటిష్టత వల్లే ఇంత వ్యాపారం జరిగిందని ఆయ‌న అన్నారు. అటల్ బిహారీ వాజపేయి హయాంలో తాను సమాచార మంత్రిగా చేశానని.. తనకు సినిమాల మీద కాస్త అవగాహన ఉందన్నారు.

అక్టోబర్ 2న సైరా, జోకర్, వార్ సినిమాలు రిలీజ్ అయ్యి రికార్డు కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే రవిశంకర్ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాల స్పందిస్తున్నారు. షోలే, లాగాన్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు మళ్ళీ రిలీజ్ చేస్తే ఎకానమీ ఇంకా పెరుగుతుందని.. అలాగే, ఫోర్బ్స్ లిస్ట్ చూస్తే తెలుస్తుంది.. దేశంలో ఎన్ని డబ్బులు ఉన్నాయో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. కొందరు మాత్రం ఇవి ఆయన సరదాగా చేసిన కామెంట్లు అంటూ కొట్టిపారేస్తున్నారు.

సామ్రాట్

Next Story