చంచల్‌గూడ జైలు నుంచి రవిప్రకాష్‌ విడుదల

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 6:11 AM GMT
చంచల్‌గూడ జైలు నుంచి రవిప్రకాష్‌ విడుదల

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ జైలు నుంచి విడుదలయ్యారు. శుక్రవారం రోజున రవిప్రకాష్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు మియాపూర్‌ కోర్టు రవిప్రకాష్‌కు రూ.15 వేల పూచికత్తు, షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈ క్రమంలో రవిప్రకాష్‌ శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. జర్నలిస్ట్‌ సంఘాల నాయకులు, సన్నిహితులు రవిప్రకాష్‌కు స్వాగతం పలికారు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో రవిప్రకాష్‌పై రెండు కేసులు నమోదు అయ్యాయి. రూ.18 కోట్ల నిధుల అక్రమంగా తరలింపు, టీవీ9లో ఫండ్‌ను అక్రమంగా తరలించారన్న ఆరోపణలపై కేసులు నమోదు అయ్యాయి. అలాగే నకిలీ మెయిల్‌ ఐడీ సృష్టించి ఏబీసీఎల్‌ను మోసం చేసిన కేసులో కూడా రవిప్రకాష్‌కు బెయిల్‌ మంజూరు అయ్యింది.

Next Story