మ‌హేష్ కోసం రష్మిక ఏం చేసిందో తెలుసా..?

By అంజి  Published on  14 Dec 2019 8:55 AM IST
మ‌హేష్ కోసం రష్మిక ఏం చేసిందో తెలుసా..?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు లేటెస్ట్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. యంగ్ అండ్ టాలెంటెడ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇప్ప‌టికే విడుదలైన టీజర్‌, ఫస్ట్ మాస్‌ సాంగ్‌, సెకండ్ మెలొడి సాంగ్ కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ రాగా ఈ చిత్రం నుండి అంద‌రూ ఎదురు చూస్తున్న రొమాంటిక్ సాంగ్‌ ' హీ ఈజ్ సో క్యూట్'ను ఈ సోమవారం సాయంత్రం 05.04 గంటలకు విడుద‌ల‌చేయ‌నుంది చిత్ర యూనిట్.

హీ ఈజ్ సో క్యూట్ అంటూ హీరోయిన్ రష్మిక మందన్న ఈ పాట‌కు డాన్స్ చేస్తున్న వీడియో గ్లింప్స్‌ను టిక్ టాక్‌లో విడుదల చేశారు. ఈ పాటకు రష్మిక మందన్న అద్దిరిపోయే స్టెప్పులేసింది. ఆమె డ్యాన్స్‌కు మహేష్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రష్మిక, మహేష్ ఒకరినొకరు ఆటపట్టిస్తూ సాగే ఈ రొమాంటిక్ గీతానికి దేవిశ్రీ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. డిసెంబరు 16న‌ ఫుల్ సాంగ్‌ని రిలీజ్ చేయబోతోంది చిత్ర యూనిట్. సంక్రాంతి కానుక‌గా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా ’సరిలేరు నీకెవ్వరు’ విడుదల కానున్న విష‌యం తెలిసిందే.

Next Story