లైవ్‌లో ఏడ్చిన యాంకర్‌ రష్మీ గౌతమ్‌

By అంజి  Published on  31 March 2020 7:20 PM IST
లైవ్‌లో ఏడ్చిన యాంకర్‌ రష్మీ గౌతమ్‌

జబర్దస్త్‌ షో యాంకర్‌ రష్మీ గౌతమ్‌ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. లైవ్‌లో మాట్లాడుతూ కన్నీరు మున్నీరయ్యారు.

మహమ్మారి కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో ప్రజలంతా పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. కాగా రష్మీ గౌతమ్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. లాక్‌ డౌన్‌ విధించడం వల్ల మూగ జీవాల పరిస్థితి వేదన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం దొరక్క వందల మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. రోజు వారి కూలీలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, కొందరికి తినడానికి కనీసం తిండి కూడా లేదని ఆమె చాలా బాధపడ్డారు.

కాలనీల్లో వీధి కుక్కలు, ఆవులు ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నాయని కన్నీరు మున్నీరు అయ్యారు. ప్రజలు తమ మానవతా దృక్పథంతో వీధి కుక్కలు, పిల్లులు, ఇతర జీవాలపై ఆరోగ్యం దృష్టి సారించాలని చెప్పారు. మూగజీవాల కోసం పని చేస్తున్న స్వచ్ఛంధ సంస్థలకు తోచినంత సాయం చేయాలని రష్మీ గౌతమ్‌ కోరారు.



యాంకర్‌ రష్మీ గౌతమ్‌ పీఎం -కేర్స్‌కు రూ.25 వేలు విరాళంగా ఇచ్చారు. తాను నివాసం ఉంటున్న ప్రాంతంలోని శునకాలకు ఆహారం పెట్టారు.

Next Story