మద్యం తాగించి అత్యాచారం.. యువతి గర్భం దాల్చడంతో..

By అంజి  Published on  12 March 2020 11:27 AM GMT
మద్యం తాగించి అత్యాచారం.. యువతి గర్భం దాల్చడంతో..

హైదరాబాద్‌: ప్రేమ పేరుతో ఓ యువతిని శారీకరంగా వాడుకొని మోసం చేసిన ఘటన నగరంలో జరిగింది. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు తాజాగా అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వేళ్తే.. అబిడ్స్‌లో ఉంటున్న యువతిని ప్రేమిస్తున్నా అంటూ సయ్యద్‌ ఇమ్రాన్‌ హైమద్‌ అనే యువకుడు వెంబడించాడు. 2015లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత నిందితుడు ఇమ్రాన్‌.. ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. యువతిని క్రైస్తవ మతం నుంచి ఇస్లాం మతంలోకి మార్చాడు. కాగా ఓ హోటల్‌లో ఫంక్షన్‌ ఉందని చెప్పి ఇమ్రాన్‌ బలవంతంగా చేయి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా మద్యం సేవించి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. గర్భం దాల్చడంతో బలవంతంగా ఇమ్రాన్‌ అబార్షన్‌ చేయించాడని చెప్పింది.

తనను నమ్మించి మోసం చేసిన సయ్యద్‌ ఇమ్రాన్‌ను శిక్షించాలని బాధితురాలు అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన అబిడ్స్‌ పోలీసులు.. కేసును బంజరాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. తనకు జరిగిన అన్యాయం మరో యువతికి జరగకూడదని మీడియా ముందుకొచ్చినట్లు బాధిత యువతి తెలిపింది. జనవరి నెలలో ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకున్నారని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసులో ఎలాంటి పురోగతి లేదని బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది.

Next Story
Share it