ఐఏఎస్‌ ఆఫీసర్‌పై అత్యాచారం కేసు

By సుభాష్  Published on  4 Jun 2020 6:31 AM GMT
ఐఏఎస్‌ ఆఫీసర్‌పై అత్యాచారం కేసు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జంజ్‌గిర్‌-చంపాజిల్లా మాజీ కలెక్టర్‌పై అత్యాచారం కేసు నమోదైంది. జిల్లా మాజీ కలెక్టర్‌ జేకే పాతక్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ పరుల్‌ మథూర్‌ వెల్లడించారు. ఈ కేసుకు సంబంబంధించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. మే 15వ తేదీన తనపై అత్యాచారం జరిపినట్లు మహిళా ఫిర్యాదు చేసిందని, కలెక్టర్‌ కార్యాలయంలోనే ఈ అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన వివరించారు. కాగా, నేను చెప్పిన మాట విని నా కోరిక తీర్చకపోతే నీ భర్తను ఉద్యోగంలోంచి తీసేస్తానని కలెక్టర్‌ బెదిరించినట్లు ఆమె తెలిపింది.

కాగా, తనకు ఎన్నో రకాలుగా అశ్లీల వీడియోలు, ఫోటోలు కూడా పంపించారని చెబుతూ అందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ ను కూడా పోలీసులకు చూపించింది. ఆమె చూపిన ఆధారాల ప్రకారం సదరు కలెక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. నిందితుడిపై ఐపీసీ 376,506,309బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు. కాగా, జేపీ పాథక్ మే 27న ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. ఆయన జంజ్‌గిర్‌-చంపా జిల్లాలో కలెక్టర్‌గా విధులు నిర్వహించిన సమయంలో ఈ ఘటన జరిగిందని ఎస్పీ తెలిపారు.

Next Story
Share it