బాలికపై కామాంధుల అత్యాచారం.. గ్రామస్తులు ఏం చేశారంటే..

By సుభాష్
Published on : 25 Dec 2019 4:52 PM IST

బాలికపై కామాంధుల అత్యాచారం.. గ్రామస్తులు ఏం చేశారంటే..

దేశంలో హత్యలు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టి విధంగా వ్యవహరించినా కామాంధుల తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. బహిర్భూమికి వెళ్లిన ఓ బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన నల్గొండ జిల్లా, మాడ్గులమల్లి మండలం, గుండ్రవానిగూడెంలో చోటు చేసుకుంది. విషయం తెలుకున్న గ్రామస్తులు అక్కడికక్కడే సెటిల్‌మెంట్‌ చేయడంతో విషయం బయటకు రాకుండా ఉండిపోయింది. తీరా ఆ నోట, ఈనోట ఆలస్యంగా బయటకు పొక్కింది.

బెంగాల్‌ రాష్ట్రానికిచెందిన ఓ బాలిక తల్లిదండ్రులతో కలిసి గ్రామంలో నివసిస్తోంది. కాగా, బాలిక బహిర్భూమికి వెళ్లే సమయంలో మాటువేసి ఉన్న ఇద్దరు యువకులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక కుటుంబీకులు ఈ విషయాన్ని గ్రామస్తులకు ఫిర్యాదు చేశారు. గ్రామ పెద్దలు లోలోపల పంచాయితీ ఏర్పాటు చేసి బాధితురాలి కుటుంబానికి కొంత మొత్తాన్ని ముట్టజెప్పి గుట్టుచప్పుడు కాకుండా చేతులు దుపులుకొన్నారు. తర్వాత అది ఈనోటా.. ఆ నోటా బయటకు వచ్చి చివరకు పోలీసులకు చేరింది. స్పందించిన పోలీసులు గ్రామస్తులను విచారిస్తున్నారు.

Next Story