కరీంనగర్‌లో దారుణం.. భర్తను చంపేందుకు ప్రియుళ్లతో కలిసి భార్య ప్లాన్‌

By Newsmeter.Network  Published on  23 Dec 2019 4:32 AM GMT
కరీంనగర్‌లో దారుణం.. భర్తను చంపేందుకు ప్రియుళ్లతో కలిసి భార్య ప్లాన్‌

కరీంనగర్‌లో ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తనే హతమార్చాడానికి ప్లాన్ వేసింది ఓ భార్య. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కావేరి అనే మహిళకు కృష్ణవంశీతో కొన్ని సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరు కరీనంగర్‌లో నివాసం ఉంటున్నారు. భర్త వంశీ కృష్ణ రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగివచ్చేవాడు. అదే అదనుగా భావించిన భార్య కావేరి.. అదే ప్రాంతంలో పరిచయమైన ఇద్దరు యువకులు సమాన్విత్, గణేష్‌లతో వివాహేతర సంబంధం కొనసాగించింది. రెండు సంవత్సరాలుగా ప్రియుళ్లతో కలిసి కావేరి తన రాసలీలలు సాగిస్తోంది. భర్త లేని సమయంలో ప్రియుళ్లతో కలిసి కావేరి ఇంట్లోనే రెచ్చిపోయింది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన భర్త వంశీకృష్ణ.. భార్యను మందలించాడు. పద్దతులు మార్చుకోవాలని కావేరిని హెచ్చరించాడు. దీంతో భర్త మీదం కావేరి కోపం పెంచుకుంది. ప్రియుళ్లతో కలిసి భర్తను హత్య చేయడానికి ప్లాన్ వేసింది.

ఈ నెల 14న భర్త పడుకున్న సమయంలో ఊపిరాడకుండా చేసి చంపాలని భార్య కావేరి ప్రయత్నం చేసింది. అయితే అక్కడి నుంచి తప్పించుకున్న భర్త వంశీకృష్ణ 100కి డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గతంలోనూ పలువురు అమ్మాయిలను, మహిళలను మాయమాటలు చెప్పి లొంగదీసుకునేవారని, లైంగిక వేధించే వారని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు సమాన్విత్ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ.. వారితో ఫొటోలు దిగి బెదిరింపులకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. ఈ కేసును పోలీసులు క్షుణ్నంగా విచారిస్తే మరిన్ని వివాహేతరం సంబంధాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా భర్త వంశీకృష్ణ భార్య బాధితుల సంఘాన్ని ఆశ్రయించాడు.

Next Story
Share it