లిప్ట్ ఇస్తానని నమ్మబలికాడు.. కారులోనే అత్యాచారం చేశాడు
By సుభాష్ Published on 8 March 2020 1:12 PM IST
ఒంటరిగా వస్తున్న మహిళపై కామాంధుడు కన్నేశాడు. లిప్ట్ ఇస్తానని నమ్మబలికాడు. మా ఊరుకు చెందిన వ్యక్తే కదా అని మహిళ కారెక్కింది. అంతే కారులోనే ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిర్మానుషమైన ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణం తీవ్ర కలకలం రేపింది. చందనవళ్లి గ్రామానికి చెందిన ఓ మహిళ పని నిమిత్తం సమీపంలోని ఓ గ్రామానికి వెళ్లింది. పని పూర్తిచేసుకుని తిరిగి వస్తుండగా, మహిళను చూసిన ప్రవీణ్ ఈనే వ్యక్తి లిప్ట్ ఇస్తానని, కారులో రావాలని అడిగాడు. ఊరి వ్యక్తే కదా అని కారెక్కడమే ఆమెకు శాపంగా మారింది.
నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు చివరకు ఎలాగోలా తప్పించుకుని గ్రామానికి చేరుకుంది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలుపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలా కామాంధుల అగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. పోలీసులు ఇలాంటి నేరాలనే అరికట్టేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా దిశ, వరంగల్ ఘటనలు జరిగిన తర్వాత పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అయినా ఇలాంటి కామాంధుల్లో ఎలాంటి భయం లేకుండా పోతుంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.