'రణస్థలం' ఆడియో ఆవిష్కరణ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Nov 2019 8:26 AM GMT
రణస్థలం ఆడియో ఆవిష్కరణ..!

సంతోష ఆంజనేయులు సమర్పణలో శ్రీలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై రాజ్,షాలు హీరోహీరోయిన్లుగా ఆది అరవల దర్శకత్వంలో కావాలి రాజు నిర్మించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'రణస్థలం'. ఈ చిత్రం ఆడియోను నిర్మాత అమ్మ కావాలి సంతోషమ్మ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో హీరో రాజ్, హీరోయిన్స్ మేఘన, జరాఖాన్, సంగీత దర్శకుడు రాజకిరణ్, కో డైరెక్టర్ శ్రీరామ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో, నిర్మాత అయిన కావాలి రాజ్ మాట్లాడుతూ... ఈ చిత్రం షూటింగ్ టైమ్‌లో చాల కష్టాలుపడ్డాను. మా అమ్మగారు సంతోషమ్మ ఆశీస్సులతో ధైర్యంగా పూర్తిచేయగలిగాను. ఈ సినిమా ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్‌గా తెరకెక్కించాం. ఈ చిత్రం చాల అద్భుతంగా వచ్చింది తప్పకుండ విజయం సాధిస్తుంది ఈ నెల 22 విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

చిత్ర దర్శకుడు ఆది అరవల మాట్లాడుతూ... 'ఈ సినిమాకి కథే హీరో. మంచి కథతో ముందుకు వెళ్ళాం. చక్కటి అవుట్ ఫుట్ తో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. సంగీత దర్శకుడు రాజకిరణ్ వ్యాఖ్యతగా వ్యవహరించిన ఈ చిత్ర ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయిందన్నారు.

Next Story
Share it