యస్ బ్యాంకు ఛీప్‌.. రాణా కపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. యస్ బ్యాంకు సంక్షోభంలో.. రాణా కపూర్‌ హస్తం ఉందని బావించిన‌ ఈడీ.. శుక్రవారం సాయంత్రం ముంబయిలోని ఆయన నివాసంలో సోదాలు చేప‌ట్టింది.

అనంతరం విచారణ కోసం రాణా కపూర్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లిన అధికారులు.. 20 గంటల విచారణ జ‌రిపిన అనంత‌రం ఈ తెల్ల‌వారుజామున ఆయనను అదుపులోకి తీసుకుంది.విచారణకు సరిగా సహకరించకపోవడం వల్లే రాణా కపూర్‌ను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.

ఇదిలావుంటే.. ప్రస్తుతం యస్ బ్యాంకు డెబిట్ కార్డులను ఉపయోగించి.. సొంత బ్యాంకు ఏటీఎంలతోపాటు ఇతర ఏటీఎంలలోనూ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని బ్యాంకు ట్వీట్ చేసింది. యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించినప్పటి నుంచి డబ్బు విత్‌డ్రాకు ఇబ్బంది పడుతున్న ఖాతాదారులకు ఇది ఖ‌చ్చితంగా ఊరటనిచ్చే విషయం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.