పేటీఎంకు ఫోన్‌పే పంచ్‌..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2020 3:38 PM GMT
పేటీఎంకు ఫోన్‌పే పంచ్‌..

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్‌బ్యాంక్‌పై ఆర్బీఐ(రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) మారటోరియం విధించింది. ఖాతాదారుడు ఒక నెలలో రూ.50వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునేలా ఆర్బీఐ పరిమితి విధించింది. దీంతో బ్యాంకులో నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే.. యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ విధించిన ఆక్షంల నేపధ్యంలో డిజిటల్‌ పేమెంట్ యాప్‌ ఫోన్‌పే కార్యకలాపాలు సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఫోన్‌పో కు ఎస్‌బ్యాంక్‌ అతి పెద్ద భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పేటీఎం.. ఫోన్‌పేతో సరదా ట్రోలింగ్ చేసే ప్రయత్నం చేసింది.

'PaytmBank #UPI ప్లాట్‌ఫారమ్‌కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని, తన సేవలను వినియోగించుకోవాలని, ఫోన్‌పే అవసరాలకు అనుగుణంగా తమ సేవలను విస్తరించగలము అంటూ పేటీఎం ట్వీట్ చేసింది. దీని వెనుకున్న భావనను అర్థం చేసుకున్న ఫోన్‌పే గట్టిగానే బదులుఇచ్చింది. డియర్ పేటీఎం.. నీవు చెబుతున్నట్టు మీ సేవల సామర్థ్యాన్ని వీలైనంతగా విస్తరించడం సాధ్యమని అనుకుని ఉంటే ముందుగానే మీమ్మల్ని సంప్రదించి ఉండేవాళ్లం. వేగంగా పుంజుకోవాటానికి నమ్మిన వాళ్లను వదులుకోవాలను కోవడంలో అర్థం లేదు. ప్రస్తుతం మేమున్న స్థితి శాశ్వతం కాదు.. మేము మాత్రమే శాశ్వతం అంటూ ఫోన్‌పే దీటుగా జవాబిచ్చింది.



Next Story