ఓ నా బుజ్జి జొన్నా.. నీ వీడియో చూశాన్రా... వ‌ర్మ షాకింగ్ కామెంట్స్.!

By Medi Samrat  Published on  1 Nov 2019 9:17 AM GMT
ఓ నా బుజ్జి జొన్నా.. నీ వీడియో చూశాన్రా... వ‌ర్మ షాకింగ్ కామెంట్స్.!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం 'క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు'. ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి వివాదం మొద‌లైంది. ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన సంద‌ర్భంగా ఓ న్యూస్ ఛాన‌ల్ వ‌ర్మ‌తో ఇంట‌ర్ వ్యూ చేసింది. ఈ ఇంట‌ర్ వ్యూ జ‌రుగుతున్న‌ప్పుడు ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత‌ జొన్న‌విత్తుల అభిప్రాయం తెలుసుకునేందుకు లైవ్ లో ఆయ‌న‌కు ఫోన్ చేస్తే... టెక్నిక‌ల్ గా బాగుంది కానీ.. కంటెంట్ ప‌రంగా బాగోలేదు అని చెప్పార‌ట‌.

ఆ త‌ర్వాత జొన్న‌విత్తుల అభిప్రాయంపై మీ అభిప్రాయం ఏంటి అని వ‌ర్మ‌ని అడిగితే... ఆయ‌న ఏం చెప్పారో నేను విన‌లేదు. ఎవ‌రు మాట్లాడింది జొన్న‌విత్తుల చౌద‌రినా అని వ‌ర్మ సెటైర్ అన‌డం జ‌రిగింద‌ట‌. అంతే.. ఇది విన్న జొన్న‌విత్తుల‌కు బాగా కోపం వ‌చ్చింది. వ‌ర్మ పై త‌న‌దైన శైలిలో ఫైర్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ ఫిలాసఫీ పైన తను పప్పువర్మ అనే బయోపిక్ తీస్తానంటూ చెప్పడమే కాకుండా వర్మ బతికున్న శవం లాంటివాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇలా కామెంట్లు చేస్తే... వ‌ర్మ ఊరుకుంటాడా... రివర్స్ కౌంటర్ ఇచ్చేశాడు. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలతో ట్వీట్ చేశాడు. ఇంత‌కీ వ‌ర్మ ఏమ‌ని ట్వీట్ చేసాడంటే... ‘ఓ నా బుజ్జి జొన్నా, నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్. నువ్వు అప్పుడప్పుడూ దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీతో ఎంజాయ్ చెయ్యి బేబీ. లేకపోతే ఫ్రస్ట్రేషన్‌తో చచ్చిపోతావ్ జొన్నా. నీ భార్య పిల్లలు నిన్నెలా భరిస్తున్నారు డార్లింగ్. వాళ్ళ మీద జాలేస్తుంది స్వీట్ హార్ట్.. కానీ ఐ లవ్ యు డా’ అంటూ ట్వీటేశారు. మరి.. వ‌ర్మ కామెంట్స్ పై జొన్నవిత్తుల ఎలా స్పందిస్తారో చూడాలి.Next Story