మూడు పార్టులుగా తెరకెక్కనున్న రామ్‌గోపాల్‌ వర్మ బయోపిక్‌..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2020 7:33 AM GMT
మూడు పార్టులుగా తెరకెక్కనున్న రామ్‌గోపాల్‌ వర్మ బయోపిక్‌..

నిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. కరోనా కారణంగా అందరూ షూటింగ్స్‌ వాయిదా వేసుకోగా.. వర్మ కంపెనీ మాత్రం వరుస చిత్రాలను రిలీజ్‌ చేస్తోంది. నగ్నం , క్లైమాక్స్ , థ్రిల్లర్ , పవర్ స్టార్ సినిమాలు ఇప్పటికే ఆర్జీవీ వరల్డ్ ద్వారా ప్రేక్షకుల మీదకు వదిలాడు వర్మ. ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం 'మర్డర్'‌. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు వర్మ. దీనికి కుటుంబ కథా చిత్రమ్‌ అనే ట్యాగ్‌లైన్‌ కూడా పెట్టాడు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో సినిమాను అనౌన్స్‌ చేశాడు. ఈ సారి స్వయంగా తన బయోపిక్‌ను అనౌన్స్‌ చేశాడు. ఈ చిత్రానికి రాము అనే టైటిల్‌ పెట్టాడు. ఈ చిత్రాన్ని ఈ మూడు భాగాలుగా నిర్మించబోతున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించాడు. మురళి నిర్మాణంలో నా ఆధ్వర్యంలో "దొరసాయి తేజ" ఈ చిత్రానికి దర్శకత్వం చేయబోతున్నాడు. సెప్టెంబర్ లో ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభమవుతుంది.

కాగా.. మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక్కొక్క భాగ చిత్ర నిడివి సుమారు 2గంటలు ఉంటుంది చెప్పాడు. ఒక్కొక్క పార్టులో వేరు వేరు వయస్సుల్లో వేరు వేరు అంశాలను చూపెట్టబోతున్నట్లు చెప్పాడు.

పార్ట్ 1 “రాము ".. దీంట్లో నా కాలేజ్ రోజులు, తోలి ప్రేమలు, గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నానన్నది.

పార్ట్ 2 "రామ్ గోపాల్ వర్మ".. అండర్ వరల్డ్ తో ప్రేమాయణం. ఇది నా ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ ,అమితాబ్ బచ్చన్ లతో ఉన్న అనుబంధాల గురించి.

పార్ట్ 3 “RGV”—ది ఇంటెలిజెంట్ ఇడియట్. ఇది నా ఫేయిల్యూర్లు, వివాదాలు, దేవుళ్ళ పట్ల, సెక్స్ పట్ల , సమాజం పట్ల నాకున్న విపరీత వైఖరుల గురించి.తెలుపుతుంది.'' అని వర్మ తన ట్విట్టర్ లో తెలిపాడు. ఇక మొదటి పార్టుకు సంబంధించిన ఫస్టు లుక్‌ను సాయంత్రం విడుదల చేయనున్నట్లు తెలిపాడు.Next Story