బాలీవుడ్, టాలీవుడ్ టాప్ స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ రకరకాల టోపీలు ధరిస్తుంది. గుర్రపుస్వారీ అంటే ఆమెకు చాలా ఇష్టం. కరాటేలో బ్లూబెల్ట్ కూడా ఉంది తనకు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిభావంతురాలైన గోల్ఫ్ క్రీడాకారిణికూడా తను. సినిమాల్లోకి రాకముందు జాతీయ స్థాయిలో ఈ ఆటలో మెరుపులు మెరిపించిన తారగా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపుకూడా ఉంది.

తాజాగా ఈ ధృవతార పుణేలోని గోల్ఫ్ కోర్ట్ లో సందడిగా కనిపించింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ కూడా మోడ్రన్ అటైర్ లో ఆమెతో కలసి గోల్ఫ్ ఆడారు. రకుల్ కి గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఎక్కువగా గోల్ఫ్ ఆడలేకపోతున్నానన్న బాధను ఆమె సినీ కెరీర్ కోసం త్యాగం చేయక తప్పడం లేదు. వీలైనప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా గోల్ఫ్ ఆడడానికి, ఫిట్ నెస్ కూ సమయాన్ని కేటాయించుకునే డిసిప్లిన్డ్ తారగా సినీవర్గాల్లో రకుల్ కి మంచి గుర్తింపే ఉంది.

దాదాపుగా దేశంలో ఉన్న చాలామంది ప్రముఖులతో కలసి ఆమె గోల్ఫ్ ఆడింది. ఇలా ఆదివారంనాడు ప్రత్యేకంగా పుణే గోల్ఫ్ క్లబ్ కి రావడం, సద్గురుతో కలసి గోల్ఫ్ ఆడడం వెనక చక్కటి కారణం కూడా ఉందండోయ్.. అదేంటంటే రకుల్ ఇలా కార్పొరేట్స్ తో కలసి గోల్ఫ్ ఆడేటప్పుడు చూసేందుకు అన్ని వర్గాలకూ చెందిన, ముఖ్యంగా ఉన్నత ధనిక వర్గానికి చెందిన అభిమానులు పోటీ పడతారు.

ఆ కలెక్షన్లద్వారా వచ్చిన డబ్బును నేరుగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థినీ విద్యార్థులు చదువుకోవడంకోసం కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక ట్రస్ట్ కి చేరతాయి. ఈ విధంగా ఎంతోమంది నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులకు విద్యాదానం చేసిన ఘనతకూడా రకుల్ కి దక్కుతోంది. గ్రేజీన్స్, బ్లూ టీషర్డ్, కౌబాయ్ హ్యాట్, చలువ కళ్లద్దాలు ధరించిన సద్గురుతో కలసి భూలోక తారగా మెరిసిపోతున్న రకుల్ ఆకట్టుకునే ఆహార్యంలో గోల్ఫ్ అడడం అభిమానులకు కనువిందు చేసింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.