చెమటలు పట్టిస్తున్న ‘రకుల్ ప్రీత్ సింగ్’

నటి రకుల్ ప్రీత్ సింగ్ …ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో తనదైన ముద్రను వేసుకుంది. టాప్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసిన ఈ టాప్ హీరోయిన్. అవసరమైతే సీనియర్ హీరోయిన్లతో స్టెప్పులు వేసేందుకు కూడా రెడీ అవుతుంది ఈ భామ‌. మొదటి నుంచి కమర్షియల్ బ్యూటీగానే పేరు తెచ్చుకున్న రకూల్ , ఇప్పుడు బిజినెస్ వైపు అడుగులు వేస్తోంది.

తన సంపాదనని పెట్టుబడులు పెట్టడంలో ముందుంటోంది రకూల్ ప్రీత్ సింగ్. స్టార్ హీరోలు కూడా చేయలేని ధైరర్యం ఆమె చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఇప్పటికే ఎఫ్ 45 పేరుతో జిమ్ మొదలు పెట్టి బిజినెస్ ఉమెన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. జిమ్ బిజినెస్ లో రకూల్ ప్రీత్ కు పోటీ ఇచ్చే వాళ్లు తెలుగు ఇండస్ట్రీలో కాదు…సౌత్ లోనే లేరు అనిపించుకుంది.

Rakul

రకూల్ ఈ క్రమంలోనే నాగార్జునతో కలిసి మన్మధుడు 2 సినిమా చేసింది. ఈ సినిమా ఫెయిల్యూర్ కావడంతో అవకాశాల కోసం ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం రకుల్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఒకవైపు సినిమాల్లో న‌టిస్తూనే ఫిట్నెస్ బిజినెస్ లోకి అడుగులు వేసింది. ఇప్పటికే రకుల్ ఎఫ్ 45 పేరుతో జిమ్ లను ఏర్పాటు చేసిన రకూల్ బిజినెస్ మ్యాన్ అనిపించుకుంటోంది. నిత్యం జిమ్ చేస్తూ చెమట్లు పట్టిస్తుంది. జిమ్ లో కష్టసాధ్యమైన బరువులను సైతం రకుల్ అవలీలగా ఎత్తేస్తుంది. ర‌కూల్‌ను చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ర‌కూల్ జిమ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.