'రాజు గారి గ‌ది- 3' రివ్యూ..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 12:31 PM GMT
రాజు గారి గ‌ది- 3 రివ్యూ..

రాజు గారి గ‌ది, రాజు గారి గ‌ది 2 చిత్రాల సిరీస్ లో వ‌చ్చిన మ‌రో సినిమా రాజు గారి గ‌ది 3. అశ్విన్ బాబు, అవికాగోర్‌, అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, అజ‌య్‌ఘోష్‌, ఊర్వ‌శి, హ‌రితేజ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన రాజు గారి గ‌ది 3 చిత్రాన్ని ఓంకార్ తెర‌కెక్కించారు. ఓక్ ఎంట‌ర్ టైన్మంట్స్ బ్యాన‌ర్ పై రూపొందిన రాజు గారి గ‌ది 3 చిత్రాన్ని ఈ రోజు రిలీజ్ చేసారు. రాజు గారి గ‌ది, రాజు గారి గ‌ది 2 చిత్రాల వ‌లే రాజు గారి గ‌ది 3 ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందా..? లేదా..? అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ - మాయ (అవికాగోర్) ఓ హాస్ప‌ట‌ల్ లో డాక్ట‌ర్ గా వ‌ర్క్ చేస్తుంటుంది. ఆమెకు ఎవ‌రైనా ఐ ల‌వ్ యు చెబితే.. ఎక్క‌డ నుంచి వ‌స్తుందో తెలియ‌దు కానీ.. ఆత్మ వ‌చ్చి చావ‌గొడుతుంటుంది. ఈ విష‌యం తెలిసి మాయ‌ను ప్రేమించాలంటే తెగ భ‌య‌ప‌డుతుంటారు. ఇదిలా ఉంటే... మాయ ఉన్న సిటీలోనే ఓ కాల‌నీలో అనాథ‌ అశ్విన్ (అశ్విన్ బాబు). మందు తాగుతూ కాల‌నీలో అంద‌ర్నీ ఇబ్బంది పెడుతుంటాడు. అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిపోయిన కాల‌నీవాసులు మాయ ప్రేమ‌లో ప‌డేలా చేస్తారు. మాయ వెన‌కాల ఉన్న ఆత్మ అశ్విన్ ని చంపేస్తుంది అనేది వాళ్ల ఆలోచ‌న‌. అస‌లు మాయ‌ను క‌వ‌చంలా కాపాడే ఆత్మ ఎవ‌రు..? మాయ‌ను అశ్విన్ ప్రేమించాకా ఏం జ‌రిగింది..? అనేది మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

సినిమాటోగ్ర‌ఫీ

రీ రికార్డింగ్

కామెడీ

మైన‌స్ పాయింట్స్

ఫ‌స్టాఫ్ సాగ‌దీసిన‌ట్టుగా ఉండ‌డం

హ‌ర్ర‌ర్, థ్రిల‌ర్ అంశాలు లేక‌పోవ‌డం

క‌థ‌, క‌థ‌నం

విశ్లేష‌ణ - అవికాగోర్, అశ్విన్ బాబు పాత్ర‌ల్లో ఫీల్ లేక‌పోవ‌డంతో వాళ్లు పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు.

సినిమా స్టార్ట్ అయిన త‌ర్వాత పాత్ర‌ల ప‌రిచ‌యానికి ఎక్కువ టైమ్ తీసుకోవ‌డంతో క‌థ స్లోగా వెళుతున్న‌ ఫీలింగ్ క‌లుగుతుంది. బ్ర‌హ్మాజీ, హ‌రితేజ‌, ప్ర‌భాస్ శ్రీనుల పై చిత్రీక‌రించిన కామెడీ స‌న్నివేశాలు ఏమాత్రం ఆక‌ట్టుకోలేదు. ఫ‌స్టాఫ్ అంతా సాగ‌దీయ‌డంతో సెకండాఫ్ లో క‌థ కేరళకు చేరడంతో కొంత ఏదైనా ఆసక్తిగా ఉంటుందనే ఫీలింగ్ కలుగుతుంది.

అలీ, అజయ్ ఘోష్, అశ్విన్, ఊర్వశి మధ్య ఎపిసోడ్ కొంచెం నాటుగా ఉన్నప్పటికీ.. సినిమా మొత్తానికి ఊరట కలిగించే అంశంగా మారింది. క‌థ‌, పాత్ర‌ల చిత్రీక‌ర‌ణ‌లో కూడా ఏమాత్రం కొత్త‌ద‌నం లేదు. ఇందులో నాటు కామెడీకి పెద్ద పీట వేయ‌డం సినిమాకి మైన‌స్ అని చెప్ప‌చ్చు. క‌థ పై స‌రైన క‌స‌ర‌త్తు చేయ‌క‌పోవ‌డంతో.. ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కించ‌డంలో ఓంకార్ విఫ‌ల‌మ‌య్యాడు.

బుర్రా సాయిమాధవ్ మార్కు డైలాగ్స్ ఎక్క‌డా క‌నిపించ‌వు. ఈ సినిమాకి ప్ల‌స్ పాయింట్ అంటే చోటా కే నాయుడు సినిమాటోగ్రఫి. ఆయ‌న పేలవమైన సన్నివేశాలను కూడా ఫీల్‌గుడ్‌గా మలిచారు. ఇక ఈ సినిమాకు మరో ఆకర్షణ రీ రికార్డింగ్.. కొన్ని సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ చేసింది. ఇక క్లైమాక్స్ కూడా సాదాసీదా ఉండటంతో ప్రేక్ష‌కుడు నిరాశ‌తోనే బ‌య‌ట‌కు వ‌స్తారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే... రాజు గారి గ‌ది 3 ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది..!

రేటింగ్ - 2.25/5

Next Story