రాజ్‌తరుణ్‌ 'ఒరేయ్‌.. బుజ్జిగా' ఎంత వ‌ర‌కు వ‌చ్చాడు..?

By Medi Samrat  Published on  14 Oct 2019 7:23 AM GMT
రాజ్‌తరుణ్‌ ఒరేయ్‌.. బుజ్జిగా ఎంత వ‌ర‌కు వ‌చ్చాడు..?

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె. కె. రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌.. బుజ్జిగా’. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్‌ అక్టోబర్‌ 12 నుంచి ప్రారంభమైంది.

ఈ సందర్భంగా నిర్మాత కె. కె. రాధామోహన్‌ మాట్లాడుతూ.. ”ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. రెండో షెడ్యూల్ ఈ రోజు నుంచి ప్రారంభించాం. నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్‌ జరుగుతుంది. రాజ్‌ తరుణ్‌ ఎనర్జీకి తగిన క్యూట్‌ లవ్‌స్టోరీ ఇది. సెన్సిటివ్‌ లవ్‌స్టోరీ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన కొండా విజయ్‌కుమార్‌ మరో డిఫరెంట్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నంద్యాల రవి చాలా మంచి డైలాగ్స్‌ రాశారు. ఈ చిత్రంలో వాణీవిశ్వనాథ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తప్పకుండా మా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇది మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

ఇది కూడా చదవండి:

https://telugu.newsmeter.in/nani-nandinireddy-swapnacinema-newmovie/

ఇది కూడా చదవండి:

https://telugu.newsmeter.in/sarilelu-neekevvaru-release-update/

Next Story
Share it