రజనీ, కమల్ కలిసి సినిమా.. ఇది నిజమేనా..?
By Newsmeter.NetworkPublished on : 7 Dec 2019 5:17 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్శల్ హీరో కమల్ హాసన్ మరో వైపు వీరిద్దరు తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరు కలిసి సినిమా చేస్తారా అంటే.. నిజమే అంటున్నారు కోలీవుడ్ జనాలు. కార్తితో ఖైదీ సినిమాని తెరకెక్కించిన కనకరాజ్ కమల్ హాసన్ నిర్మాణ సంస్థలో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట.
అయితే.. కమల్ నిర్మించే ఈ సినిమాలో హీరో ఎవరు అనేది ప్రకటించలేదు. రజనీకాంత్ నటించనున్నారని తెలిసింది. ఇటీవల కనకరాజ్ రజనీకాంత్ ని కలిసి కథ చెప్పాడట. కథ నచ్చి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇందులో రజనీతో పాటు కమల్ కూడా నటిస్తారని టాక్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే.. అటు రజనీ ఫ్యాన్స్, ఇటు కమల్ ఫ్యాన్స్ కి పండగే.
Next Story