బ్రేకింగ్‌: మరో పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీ.. ముగ్గురి పరిస్థితి విషమం

By సుభాష్
Published on : 7 May 2020 6:18 PM IST

బ్రేకింగ్‌: మరో పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీ.. ముగ్గురి పరిస్థితి విషమం

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన గ్యాస్‌ లీకేజీ ఘటన మరువకముందే ఛత్తీస్‌గఢ్‌లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. రాయ్‌గఢ్‌లోని పేపర్‌ మిల్లులో గ్యాస్‌ లీకై ఏడుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. ఇటీవల కేంద్రం సడలింపులు ఇవ్వడంతో పరిశ్రమలన్నీ తెరుచుకున్నాయి. ఈ క్రమంలో రాయ్‌గఢ్‌లో పేపర్‌ మిల్లు కూడా తిరిగి ప్రారంభమైంది. గురువారం మిల్లులోని ట్యాంకును శుభ్రం చేసేందుకు ఏడుగురు కార్మికులు వెళ్లారు. ట్యాంకులోకి దిగి శుభ్రం చేస్తున్న సమయంలో గ్యాస్‌ లీకై అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే పరిశ్రమలో ఎక్కువ మంది కార్మికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి.



Next Story