టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్య ఎన్నికల అధికారి కి భూమి బహూకరించిందా?

By సత్య ప్రియ  Published on  1 Nov 2019 6:25 AM GMT
టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్య ఎన్నికల అధికారి కి భూమి బహూకరించిందా?

ఇటీవల, 2019 ఏప్రిల్ లో జరిగిన తెలంగాణ ఎన్నికల తరువాత, ఎన్నికలలో తమకు సహాయం చేసినందుకు గాను టీఅర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి, డా. రజత్ కుమార్ కు 15.25 ఎకరాల భుమి బహుమానంగా ఇచ్చిందనే మెసేజ్ వాట్సాప్ లో తిరుగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని బాలానగర్ మండలం, హేమాజీపూర్ గ్రామంలో ఈ స్థలాలు ఉన్నట్టు ఈ మెసేజ్ లో ఉంది.

ఈ ఆరోపణలకు స్పందిస్తూ డా. రజత్ కుమార్, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని సైబర్ క్రైం లో ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో, తన భార్య అచలా కుమార్ తో కలిసి ఈ భూములను 2013 -2014 లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించామని తెలిపారు.

ఈ తప్పుడు ప్రచారాన్ని వెంటనే ఆపే ప్రయత్నం చేయాలనీ, అలాంటి పోస్టింగ్లతో వ్యక్తిగతంగా తనను, తన కుటుంబాన్ని మానసిక ఆవేదనకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయనే సైబర్ క్రైం పోలీసులను కోరారు.

Pic 2

నిజ నిర్ధారణ:

న్యూస్ మీటర్ బృందం పరిశోధనలో తెలింది ఏమిటంటే, డా. రజత్ కుమార్ పేర్కొన్న విధంగానే 2014 లో భూమి ని కొనుగోలు చేశారు. ఈ కొనుగోలును ధృవీకరించే ప్రభుత్వ పత్రాలు ఉమ్మడి రాష్ట సాధారణ పరిపాలన విభాగం లో లభించాయి.

Pic 3

ఆశక్తికర విషయం ఏమిటంటే, డా. రజత్ కుమార్ ముఖ్య ఎన్నికల అధికారిగా ఫిబ్రవరీ 19, 2019న చేరారు. అంతకుమునుపు ఆయన అటవీ శాఖలో ప్రధాన కార్యదర్శి గా పని చేశారు. 2014లో, భూమి రిజిస్టర్ అయిన సమయంలో అంటే 2014లో శ్రీ బన్వర్ లాల్, ఐఏఎస్ ముఖ్య ఎన్నిక అధికారిగా ఉన్నారు. 2018లో డా. రజత్ కుమార్ విధులలో చేరారు.

కనుక, టీఅర్ ఎస్ ప్రభుత్వం, తమకు ఎన్నికలలో సహాయం చేసినందుకుగానూ డా. రజత్ కుమార్ కు భూమి కానుకగా ఇచ్చిందనడంలో నిజం లేదు.

ప్రచారం: 2019 ఏప్రిల్ లో జరిగిన తెలంగాణ ఎన్నికల తరువాత ఎన్నికలలో తమకు సహాయం చేసినందుకు గాను టీఅర్ ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి, డా. రజత్ కుమార్ కు 15.25 ఎకరాల భుమి బహుమానంగా ఇచ్చింది.

ప్రచారం జరుతున్నది: వాట్సాప్ లో

నిజ నిర్ధారణ: అబద్దం. ఇది తప్పుడు ప్రచారం. ముఖ్య ఎన్నికల అధికారిగా చేరక ముందే ఆ భూమిని డా.రజత్ కుమార్ కొనుగోలు చేశారు.

Next Story