ఐపీఎల్ ఆరంభానికి ముందే.. రాజస్థాన్ రాయల్స్‌కు షాక్..!
By తోట వంశీ కుమార్ Published on 12 Aug 2020 9:02 AM GMTయూఏఈ వేదికగా సెప్టెంబర్ -19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ ప్రారంభం కాకముందే రాజస్థాన్ రాయల్స్ ప్రాంచైజీకి గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్‌కు కొవిడ్-19 సోకింది. దీంతో అతను 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లోకి వెళ్లాడు.
యూఏఈ వెళ్లే 24 గంటల ముందు రెండు సార్లు ఆర్‌సీటీ, పీసీఆర్ పరీక్షలు చేయించాలని బీసీసీఐ నిబంధనలు విధించింది. వచ్చేవారం రాజస్థాన్ రాయల్స్ సభ్యులంతా ముంబాయి శిబిరానికి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అందరిని కరోనా పరీక్షలు చేయించుకోవాలని రాయల్స్ సూచించింది. ఫ్రాంచైజీ సూచనలతో దిషాంత్ యగ్నిక్ కోవిడ్-19 పరీక్షలు చేసుకోగా పాజిటీవ్ వచ్చింది. దీంతో ఆటగాళ్లందరకి అదనపు టెస్ట్‌లు చేసేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్దమైంది.
ప్రస్తుతం దిశాంత్ తన సొంతూరు ఉదయ్‌పూర్‌లో ఉన్నాడు. 14 రోజులు క్వారంటైన్‌కు వెళ్లనున్నారు. అలాగే దిశాంత్‌తో టచ్‌లో ఉన్న ఆటగాళ్లంతా క్వారంటైన్ పాటిస్తూ కోవిడ్-19 పరీక్షలు చేసుకోవాలని రాజస్థాన్ టీమ్ కోరింది. అయితే రాయల్స్ ఆటగాళ్లతో పాటు ఇతర ఐపీఎల్ ప్లేయర్లు ఎవరూ దిశాంత్‌ను కలవలేదని స్పష్టం చేసింది. క్వారంటైన్ అనంతరం దిశాంత్‌కు రెండు సార్లు పరీక్షలు నిర్వహిస్తాం. యూఏఈకి చేరుకున్నాక మళ్లీ మూడు పరీక్షలు చేయించుకుని ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఆతర్వాతే బయోబుడగలో అడుగుపెట్టాలని రాజస్థాన్ రాయల్స్ టీమ్ తెలిపింది.