మంగాయమ్మ రికార్డ్‌ బ్రేక్‌ చేసిన రాజస్థాన్‌ బామ్మ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Oct 2019 11:43 AM GMT
మంగాయమ్మ రికార్డ్‌ బ్రేక్‌ చేసిన రాజస్థాన్‌ బామ్మ

అమ్మ కావాలనే కోరిక బలీయంగా ఉన్న ఎర్రమట్టి మంగాయమ్మ పెళ్లైన 57 ఏళ్ల తర్వాత పురుడు పోసుకుంది. సంతాన సాఫల్య విధానంతో బామ్మ అని పిలిపించుకోవాల్సిన వయసులో మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది మంగాయమ్మ. అయితే తాజాగా రాజస్థాన్‌ కోటాకు చెందిన 75 ఏళ్ల మహిళ ఈ రికార్డ్‌ను బ్రేక్‌ చేసింది. రాజస్థాన్‌లో ఓ వృద్ధ దంపతులకు పెళ్లై 50 ఏళ్లు అయిన పిల్లలు పుట్టలేదు. దీంతో వాళ్లు కూడా ఐవీఎఫ్‌ విధానాన్ని ఆశ్రయించారు. ఐవీఎఫ్‌ ద్వారా గర్భం దాల్చినట్లు కింకార్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 75 ఏళ్ల బామ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం బామ్మ శిశువు 600 గ్రామలు బరువు ఉంది. ఎన్‌ఐసీయూలో శిశువును వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఐవీఎఫ్‌ విధానం ద్వారా సుదీర్ఘకాలం తర్వాత బామ్మ కోరిక నెరవేరింది.

Next Story