భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నిజాంపేట్‌, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, ఉప్పల్‌, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లోని రోడ్లన్ని జలమయం అయ్యాయి. కాగా, ఆదివారం రాత్రి నగరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సహాయక చర్యలు చేపట్టేందుకు సహాయక బృందాలను అప్రమత్తం చేశారు అధికారులు.

వర్షం కారణంగా విద్యుత్‌ అంతరాయం కలిగిన ప్రాంతాల్లో విద్యుత్‌ సిబ్బంది అప్రమత్తమైన మరమ్మతులు చేపట్టారు. నగర వాసులకు ఇబ్బందులు కలుగకుండా ముందు జాగ్రత్తగా సిబ్బంది అప్రమత్తం చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.