హైదరాబాద్‌: రైల్వే టికెట్‌ ఛార్జీలను స్వల్పంగా పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఆర్డినరీ సెకండ్‌ క్లాస్‌‌, స్లీపర్‌ క్లాస్‌కు కిలోమీటరకు ఒక పైసా చొప్పున పెంచాలని నిర్ణయించింది. మెల్‌ ఫస్ట్‌క్లాస్‌, స్లీపర్‌ క్లాస్‌కు 2 పైసల చొప్పున పెంచింది. ఏసీ టూటయర్‌‌, త్రిటయర్‌‌, ఏసీ ఫస్ట్‌క్లాస్‌, ఏసీ చైర్‌కారుకు కిలోమీటరుకు 4 పైసలు పెంచారు. పెంచిన చార్జీలు నేటి అర్థరాత్రి నుంచి అమలులో వచ్చాయి. ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు రైల్వే శాఖ ఊరటనిచ్చింది. సబర్మన్‌, ఎంఎంటీఎస్‌ రైలు ఛార్జీలను రైల్వేశాఖ పెంచలేదు. 2014లో చివరిసారిగా రైల్వేటికెట్‌ చార్జ్‌లను పెంచారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సర్క్యూలర్‌ జారీ చేసింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.